భారత్ సంచలన విజయం
కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.. వర్షంతో రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెల్సిందే. అయిన ముందు బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 233పరుగులకు ఆలౌటైంది.
మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా తొమ్మిది వికెట్లకు 285పరుగులకు డిక్లెర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొంబై ఐదు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన టీమిండియా మూడు వికెట్లను కోల్పోయింది.
పదిహేడు ఓవర్ల రెండు బంతుల్లో ఈ లక్ష్యాన్ని చేదించింది. రోహిత్ శర్మ 8, శుభమన్ గిల్6, జైశ్వాల్ 51, విరాట్ కోహ్లీ 29* పరుగులు చేశారు. రెండు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ గెలుపొందిన టీమిండియా రెండో మ్యాచ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసి సిరీస్ ను సొంతం చేసుకుంది.