అర్హులైన ప్రతోక్కరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసానివ్వాలి..!

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు పర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికి అమలు చేయాలి.
గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయం.రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24.57 లక్షల మంది ఉన్నారు.కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలి.
నియోజకవర్గానికి 3500 ఇండ్లుకు లబ్ధిదారుల ఎంపిక ఎవరు చేస్తారు?.గ్రామసభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలి.గత ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తికాని ఇళ్ళకు కూడా నిధులు విడుదల చేయాలి అని కోరారు.
