ఐపీఎల్ క్రికెటర్లకు లాభమా..?.నష్టమా..?
దాదాపు రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్ నిన్న ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది.
అరవై రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నిలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు భాగమయ్యారు. మరి ప్లేయర్లకు ఐపీఎల్ లాభదాయకమేనా అంటే.. లీగ్ లో ఆడటం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి అంటున్నారు క్రీడాపండితులు..
లీగ్ లో ఆడటం వల్ల ఆటగాళ్ల ప్రతిభ బయటపడటం, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం, ఒత్తిడిని జయించడం, దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం వంటి లాభాలు కలుగుతాయి.
అలాగే మరోవైపు ఆట ఆడటం వల్ల అలసిపోవడం, దేశ జట్టుపై సీరియస్ నెస్ కొరవడటం, గాయాల పాలవడం వంటి నష్టాలు ఉన్నాయి.