తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయుకట్టుకు సాగునీళ్లు..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాము. ఇరవై ఏడు చెరువుల కింద ఉన్న రెండు వేల నాలుగోందల ఎకరాలకు సాగునీళ్లు అందిస్తాము అని తెలిపారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయుకట్టుకు సాగునీరు ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేసిన లక్ష ఎకరాలను కూడా ఆయుకట్టులోకి తీసుకురాలేదని ఆయన విమర్శించారు.
