KCR యుద్ధం చేసే టైం వచ్చిందా…?

 KCR యుద్ధం చేసే టైం వచ్చిందా…?

కేసీఆర్ ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు “ఏదైనా మొదలెట్టినప్పుడు అది సాధించేవరకు పోరాడాలి.. కొట్లాడాలి.. అవసరమైతే ప్రాణాలకు తెగించి మరి  గెలవడానికి ప్రయత్నించాలి “అని.. పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష సమావేశాల్లో కానీ కేసీఆర్ ఇదే చెప్తూ ఉంటారు అని అందరూ అంటుంటారు.. అయితే తాజాగా ఈరోజు కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ కు కనీసం పైసా కూడా కేటాయింపులు చేయలేదు..  పక్కనున్న ఏపీకి ఏకంగా పదిహేను వేల కోట్లతో అమరావతికి అండగా ఉండటమే కాదు పోలవరం పూర్తి అవ్వడానికి… రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. నిధులు సంగతి దేవుడేరుగు తన మొత్తం ప్రసంగంలో తెలంగాణ పదాన్నే ఉచ్చరించలేదు.. ఏపీకి నిధులు ఇచ్చినందుకు మాకు సంతోషం కానీ పేరు కూడా పలకని విధంగా తెలంగాణ బీజేపీ కి ఏమి అన్యాయం చేసింది.. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి కానుకగా ఇవ్వడం మేము చేసిన తప్పా.. మట్టికైనా మనోడు ఉండాలి.. ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ప్రేగులు తెగేలా కేంద్రంపై కొట్లాడేవాళ్ళు.. నిధులు తీసుకువచ్చేవారు అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మీడియా సమావేశంలో అన్న సంగతి మనకు తెల్సిందే..

అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ “పద్దెనిమిది సార్లు ఢిల్లీ వెళ్ళాము.. మేము మామంత్రులు ప్రధాని మోడీ తో సహా కేంద్ర మంత్రులను పలుమార్లు కలిశాము.. తెలంగాణకు నిదులు ఇవ్వాలని కోరాము.. అయితే బడ్జెట్ లో సున్నా కేటాయింపులు చేశారు.. కేంద్రం పై కేసీఆర్ పోరాటం చేయాలని” అన్నారు.. ఈ వ్యాఖ్యలతో “కేసీఆర్ యుద్ధం చేసే సమయం వచ్చింది.. తన వల్ల ఏమి కాదు.. కేసీఆరే తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రాంతానికి కోసం పోరాడగలడు అని చెప్పకనే చెప్పాడు రేవంత్ రెడ్డి ” అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..నిజమే మరి నాడు రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు.. తీసుకురావడమే కాదు రాష్ట్రం విడిపోతే చీకట్లో మగ్గుతారు.. నీళ్ల గొడవలు మొదలవుతాయి.. నక్సలిజం పెరుగుతుంది అని నాడు కట్టెలు పట్టుకుని చెప్పిన వాళ్ళ నోర్లు మూతపడేలా పాలించాడు కేసీఆర్.. పాలన చేత కాదన్నవాళ్ళే పాలకుడు అంటే ఇలా ఉండాలి.. నాయకుడు అంటే కేసీఆర్ అని మెచ్చుకునేలా పరిపాలించాడు కేసీఆర్..

అలాంటి కేసీఆర్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంపీ ఎన్నికల ప్రచారం..పార్టీ రివ్యూ మీటింగ్స్ లో తప్పా ఎక్కడ కూడా కన్పించలేదు.. మొదటి అసెంబ్లీ సెషన్ లో కూడా అనారోగ్య పరిస్థితుల వల్ల హాజరు కాలేదు.. కానీ ఇప్పుడు ఇటు అసెంబ్లీ అటు ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన అవసరం వచ్చింది.. ఇప్పుడు కేసీఆర్ వస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుందా..?. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ సర్కారు వస్తుందా..? అని కాదు.. కేసీఆర్ ఒక అంశాన్ని ఎత్తుకున్నాడు అంటే అది సాధించేవరకు ఎంత దూరమైనా వెళ్తాడు.  ఎవర్ని అయిన ఎదిరిస్తాడు అని కండ్ల ముందు కదలాడే చరిత్ర. అలాంటి కేసీఆరే కేంద్ర సర్కారుపై కొట్లాడగలడు.. పోరాడగలడు.. ఒత్తిడి తీసుకురాగలడు అని రేవంత్ రెడ్డి నమ్మకం. ఎందుకంటే ఇటు లోక్ సభ లో అటు రాజ్యసభలో మెజారిటీ తక్కువగా ఉంది… జేడీయూ కానీ టీడీపీ కానీ తమ మద్ధతును ఉపసంహరించుకుంటే ప్రభుత్వం మైనార్టీ లో పడిపోతుంది.. అది కాకుండా బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేము అని తేల్చి చెప్పింది కేంద్రం . అందుకే ఈ బడ్జెట్ లో నిధులు ఎక్కువగా కేటాయించింది అని రాజకీయ విశ్లేషకుల టాక్..

కానీ కేసీఆర్ కనుక కదన రంగంలోకి దూకితే ఇటు వైపు ఏపీలోని వైసీపీ ఆప్ డీఎంకే, జేఎంఎం లాంటి పార్టీలు సైతం కేసీఆర్ తో జత కలిసే అవకాశం ఉంది. ఇవి తోడైతే రాజ్యసభలో ఏ బిల్లు పెట్టిన కానీ వీగిపోయే ప్రమాదం పొంచి ఉంది.   ఒకవేళ జేడీయూ ప్రత్యేక హోదా కోసం పట్టుబడితే అధికారం కోల్పోయే అవకాశం లేకపోలేదు.. ఎందుకంటే బీహార్ కిస్తే ఏపీలాంటి ఎన్నో రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాయి.. అందుకే మోడీ ని ఎదిరించగల సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి నమ్మకమే కాదు గత పడేండ్ల లో ఇటు తెలంగాణ తో పాటు యావత్తు దేశమే చూసిన నగ్న సత్యం.. అందుకే ఆ భయంతోనే ఎన్నికలకు ముందు తన కూతురైనా ఎమ్మెల్సీ కవితను అక్రమ కేసుల్లో ఇరికించి ఇప్పటికి జైల్లో ఉంచారు అని రాజకీయ విశ్లేషకుల అంచనాలు.. అయితే ఇప్పుడే కేసీఆర్ పోరాడాల్సిన అవసరంలేదు. కొన్ని రోజులు చూసి అప్పటికి కేంద్రం తెలంగాణ పైనే కాదు దక్షిణాది రాష్ట్రాలపై చూసే తీరు మారకపోతే అప్పుడు దిగితే ఏమైనా లాభం ఉంటుంది ఇటు పార్టీ పరంగా కానీ దేశ ప్రజల పరంగా కానీ..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *