రేవంత్ రెడ్డి అసహానం వెనక అసలు కారణం ఇదేనా..?
ఓ ప్రతిపక్ష నేత నోరు తప్పిండంటే ఆర్ధం ఉంటది..?. చౌకభారు విమర్శలు చేశారంటే అధికారం లేదు కాబట్టి ఆ ప్రస్టేషన్ లో మాట్లాడిండులే అని అనుకుంటారు. అవినీతి అక్రమ ఆరోపణల భాణం సందించారంటే అధికారం కోసం ఎంతవరకైన తెగించారులే అని సర్దుకుంటారు. కానీ దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఓ నేత అది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చౌకభారు విమర్శలు.. వ్యక్తిగత దూషణలు అఖరికి ఓ వ్యక్తి చావు కోరుకున్నాడంటే ఉన్న పదవికి ఎసరైన రావాలి. లేదా తనకు సమీపంలో పదవి గండం అయిన ఉందని అనుకోవాలని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
నిన్న శుక్రవారం మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా సంగెం మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే వాళ్ల ఉసురు తగిలి కుక్క చావు చస్తావ్ కేసీఆర్ అంటూ ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగారు. మూసీ ప్రక్షాళన మొదలెట్టిన దగ్గర నుండి మూసీ పరివాహక బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు.. నేతలు అడ్డుపడ్డారు . మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ ఏనాడు కూడా మీడియా ముందుకు రావడం కాదు కనీసం ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆరే మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నాడు అనే స్థాయిలో నిన్న ఓ రేంజ్ లో విమర్శల వర్షం కురిపించాడు.
విమర్శలు ఆరోపణలైతే ఎవరూ పట్టించుకోరు. కానీ తెలంగాణను తెచ్చినోడు.. పదేండ్ల పాటు సంక్షేమాభివృద్ధి అందించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన కేసీఆర్ చావును కోరడం ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు అటు తెలంగాణ వాదులకు మింగుడుపడలేదు. దీంతో నిన్న అంతటా రేవంత్ రెడ్డిపై ప్రత్యేక్షంగా పరోక్షంగా విమర్శలతో కౌంటర్లతో విరుచుకుపడ్డారు. రాజకీయంగా ఓ వ్యక్తిని లేదా ప్రత్యర్థి పార్టీని ఎన్ని విమర్శలు అయిన చేయచ్చు. ఆరోపణల బాణం సందించవచ్చు కానీ ఇలా చావులను కోరుకోవడం కరెక్టు కాదు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది.
అందుకే మిగిలిన ఆరు మంత్రిత్వ శాఖలను కూడా భర్తీ చేయలేదు. గత నాలుగు నెలలుగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ సైతం ఇవ్వడం లేదు. దీంతో ఆ ప్రస్టేషన్ తోనే రేవంత్ రెడ్డి ఇలా అసహానంతో ఎగిరిఎగిరిపడుతున్నారు అని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరేలా గతంలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం వచ్చేడాది జూన్ ఆగస్ట్ నెల మధ్యలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ముద్రపడ్డ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,మంత్రి కోమటిరెడ్డి తప్పా ఎవరూ ఖండించిన పాపాన పోలేదు. తన ముఖ్యమంత్రి పదవి పోతుందనే ప్రస్టేషన్ తోనే ఇలా ప్రవర్తిస్తున్నాడని గాంధీ భవన్ వర్గాలు సైతం గుసగుసలాడుకుంటున్నాయి.