ఓరుగల్లులో రేవంత్ వ్యాఖ్యల వెనక అసలు ట్విస్ట్ ఇదేనా…?
వరంగల్ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక సభలో సీఎం అనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెను క ఆంతర్యం ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘తెలంగాణ అమ్మ సోనియా.. ఆమె కాళ్లు నేనే కాదు ఇక్కడున్నవాళ్లందరూ (స్టేజీ మీద కూర్చున్నవాళ్లను చూపుతూ) కడిగి వాటిని నెత్తిన చల్లుకుంటాం’ అని పేర్కొన్నారు.
ఆ తరువాత ‘ఈ సీటుకు ఊకనే వచ్చిన్నా.. అందరినీ తొక్కుకుంటా వచ్చిన’ అని మరుక్షణంలోనే ‘కేసీఆర్..నీ సీటును తొక్కుక్కుంటా వచ్చిన’ వ్యాఖ్యానించటం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై పల్లెత్తు మాట అనని సీఎం ఉన్నపళంగా ‘రాష్ట్రం విడిచిపెట్టి పోవాలి.
తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపో’ అని హూంకరించ టం వెనుక ఏదో మతలబు ఉంటుందని అభిపాయపడుతున్నారు. రేవంత్ కాంగ్రెస్‌ను టీడీపీ కాంగ్రెస్‌గా మార్చారని, బీజేపీతో దగ్గ రి సంబంధాలు పెట్టుకున్నారని కాంగ్రెస్ హై కమాండ్‌కు చేర్చారని.. దీంతో తానే అందరి కన్నా కాంగ్రెస్‌కు వీరవిధేయుడని ప్రదర్శించేందుకే సీఎం ఆరాటపడ్డారని అందులో భాగమే ఆ ఆగ్రహతపన అని కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం బలంగా విశ్వసిస్తున్నది.