కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది…?

Injustice to Medigadda due to blind hatred towards KCR!
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు చెల్లవనడం చాలా బాధాకరం.
తమ లెటర్లు ఏపీలో చెల్లకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ళకు మన ఆస్తులు కావాలంట. మొన్ననే పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు. మన ఆస్తులు కావాలి కానీ తిరుమలలో మనకు హక్కు లేదంట అని ఆయన అన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న పదేండ్లలో ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. మంత్రులు ఎవరూ తిరుపతికి లెటర్లు ఇచ్చిన చెల్లేది. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన నడవటం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే తిరుమలలో బాగుండేది అని సెటైర్లు వేస్తున్నారు.
