11వ క్రికెటర్ గా జడేజా
టీమిండియా స్పిన్నర్.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో మూడు వేల పరుగులతో పాటు మూడోందల వికెట్లను తీసిన పదకొండో క్రికెటర్ గా నిలిచాడు.
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ లో జడేజా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. జడేజా కంటే ముందు ఇమ్రాన్ ఖాన్ , రిచర్డ్ హ్యాడ్లీ , ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, వార్న్ , చమిందా వాస్ , పొలాక్, వెటోరి ,బ్రాడ్, అశ్విన్ ఈ జాబితాలో చేరారు.
మరోవైపు టెస్ట్ ల్లో మూడోందల వికెట్లను తీసిన తొలి లెప్టార్మ్ స్పిన్నర్ గా జడేజా రికార్డును సృష్టించాడు.