ఓ సాధారణ ఎమ్మెల్యేగా జగన్..?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈరోజు శుక్రవారం నుండి మొదలు కానున్నాయి..ఈ సమావేశాల్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ప్రోటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు..
ఇంగ్లీష్ వర్ణమాల ఆధారంగా ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఆ తర్వాత డిప్యూటీసీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ చేయనున్నారు..
అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఓ సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు..