జగన్ సంచలనాత్మక డిమాండ్

YS Jagan Mohan Reddy Former CM OF Andhrapradesh
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలనాత్మకమైన డిమాండ్ చేశారు. వినుకొండలో హత్యకుగురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు.. రషీద్ కుటుంబానికి అన్నివేళల అండగా ఉంటాము. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు.. ప్రాణమానాలకు రక్షణ లేదు..
మా పార్టీ నేతల..కార్యకర్తలపై భౌతికదాడులు జరుగుతున్నాయి.. ఈదాడిలో మా పార్టీకి చెందిన రషీద్ అనే కార్యకర్తను హత్య చేసి మరణానికి కారణమైంది టీడీపీ.. గత నెలన్నర రోజులుగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది..
అందుకే వెంటనే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలన్నా.. ప్రజల మానప్రాణాలకు రక్షణ ఉండాలన్నా రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలిపారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగుతాము. రాష్ట్రంలో నలబై ఐదు రోజులుగా మూడు వందల హత్యలు జరిగాయి.. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు.. మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేల ఇండ్లపై జరుగుతున్న దాడుల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలుస్తాము అని తెలిపారు.
