ఓడిన తీరు మార్చుకోని జగన్ …?
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన .. అఖరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇప్పటికి తన తీరు మార్చుకోవడం లేదా..?. ఐదేండ్లు అధికారంలో ఉన్న సమయంలో క్యాడర్ ను పక్కనెట్టు కనీసం ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీలను కలవడానికి సమయమివ్వలేదని అపవాదు అప్పట్లో ఉంది. తాజాగా ఓడిన కానీ నేతలను.. క్యాడర్ ను కలవాలంటే జగన్ అపాయింట్మెంట్ కావాలి. ఆ అపాయింట్మెంట్ కావాలంటే కూడా ఓ కలగానే మిగులుతుంది అని వైసీపీ నేతలు.. క్యాడర్ వాపోతున్నారు.. జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదా.. లేక ఆయన చుట్టూ ఉన్న బలగం ఇవ్వడం లేదా అని మనోవేదన చెందుతున్నారు….
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి లాంటి ముఖ్యులు తప్పా ఇటీవల కల్సినవాళ్ల జాబితా తీస్తే వ్రేళ్లపై లెక్కపెట్టుకోవాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అలాగే వ్యవహరించి.. ఇప్పుడు అలాగే వ్యవహారిస్తే క్యాడర్.. నేతలు ఏమైపోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. కూటమి పాలనలో ప్రతిపక్ష వైసీపీ నేతల దగ్గర నుండి మాజీ మంత్రులు. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ.. కార్యకర్తలపై పలుచోట్ల దాడులు జరుగుతున్నాయి. మాపై దాడులు జరుగుతున్నాయి.
మాకు నష్టం వాటిల్లుతుందని చెప్పుకుందామని అడిగిన కానీ దిక్కే లేదంటూ వైసీపీ నేతలు.. కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీ పునర్నిర్మాణం పక్కనెట్టు కనీసం కలిసే సమయమే లేదంటే ఐదేండ్లు పార్టీ ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన జగన్ తన తీరు మార్చుకోని నేతలతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటే మంచిదని వారు భావిస్తున్నారు. మరి జగన్ తీరు మార్చుకుంటారా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.