జనవరి 26 – కాంగ్రెస్ భారీ కుట్ర..?

 జనవరి 26 – కాంగ్రెస్ భారీ కుట్ర..?

Loading

తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసారు.ఆయన మాట్లాడుతూ తెలంగాణలో హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి డిల్లీకి వెల్లి తెలంగాణలో హామీలు అమలు చేసే భాద్యను తాను తీసుకుంటాననటం రాజకీయాల్లో అత్యంత దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు..రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 100రోజుల్లో హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి..హామీల అమలుపై దేవుళ్ళపై ఒట్లు వేసి ప్రజలతో పాటు దేవుళ్ళను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు.

100 రోజుల్లో కాదు 400 రోజులైనా హామీలను అమలు చేయకుండా రాజ్యాంగం అమల్లోకొచ్చిన జనవరి 26 న అమలు చేస్తామంటూ కళ్లబొల్లి మాటలు మాట్లాడుతూ ఆ రోజును అపవిత్రం చేస్తున్నాడన్నారు. 100 రోజుల్లో నెరవేరుస్తానన్న హామీలను ఎగవేసి పవిత్రమైన జనవరి 26 తేదిన అమలు చేస్తామని మాట మార్చడం రాజ్యాంగాన్ని అవమానపరచడంగానే బీఆర్ఎస్ బావిస్తుందన్నారు.. రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది,బోనస్ బోగస్ గా మారింది.ప్రతీ పంటకు బోనస్ అన్నారు. ధాన్యానికి బోనస్ ఇస్తామని సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ను పరిమితం చేసారని విమర్శించారు.బోనస్ ఎగవేయాలనే ఉద్దేశ్యంతో దాన్యం అంతా ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెల్లాక ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించింది..ఇది కుట్రపూరితంగా రైతులకు బోనస్ ఎగ్గోట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఎత్తుగడ వేసిందన్నారు

55 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని రిపోర్ట్ ఉన్న నేపథ్యంలో ఆలస్యం చేసి 20 లక్షల టన్నులను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయడం రైతులను మోసం చేసే కుట్రలో భాగంగానే భావించాల్సి ఉంటుందన్నారు..బోనస్ బోగస్ గా మారింది.ఇప్పటికి అదిక సంఖ్యలో రైతుల ఖాతాల్లో డబ్బు జమకాలేదు..లక్షన్నర మంది రైతులు 2 నెలలుగా బోనస్ కోసం అప్పుల పాలై ఎదురు చూస్తున్నారని,రైతులకు బోనస్ ఎగవేసిన కాంగ్రేస్ ప్రభుత్వం సిగ్గుంటే రైతులకు క్షమాపణ చెప్పి బోనస్ డబ్బులు విడుదల చేయీలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.రైతాంగాన్ని అడుగడుగునా నయవంచన చేసింది కాంగ్రేస్ ప్రభుత్వం.గ్రామాల్లో ఎక్కడా 50% కూడా రుణమాఫీ జరగలేదు..రైతుభరోసా పేరుతో రైతులకు ఇస్తామన్న సాయాన్ని తగ్గించి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇచ్చిన మాట ప్రకారం రెండు దఫాలుగా ఎగవేసిన ఎకరాకు 17500 రూపాయల రైతు భరోసాను తక్షణమే రైతులకు చెల్లించాలన్నారు.అవి చెల్లించక పోగా జనవరి 26 న 6 వేలు వేస్తామని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ..ప్రకటన రూపంలో మీరు తప్పించుకున్న రేపు గ్రామాల్లో ముఖ్యమంత్రిని,మంత్రులను,ఎమ్మెల్యేలను,గ్రామ,మండల నాయకులను ప్రజలు నిలదీస్తారని హెచ్చరిస్తున్నం.. స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో పర్యటిస్తే ప్రజలు నిలదీస్తారనే భయంతో జనవరి 26 వేదికగా అన్ని హామీలు అమలు చేస్తామనే బోగస్ ప్రకటనకి తెరతీసింది..స్థానిక సంస్థల ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టి మల్లీ గద్దెనెక్కాక హామీల ఎగవేత చేయాలని కాంగ్రేస్ బావిస్తుంది.రైతురుణమాఫీ,రైతు భరోసా,బోనస్ లు ఎలా బోగస్ గా మారాయో,స్థానిక ఎన్నికల తర్వాత అన్నీ బోగస్ గానే మారుతాయని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఎన్నికల మేనిఫేస్టోలో ప్రతీ వ్యవసాయ కూలికి 12000 రూపాయలు చెల్లిస్తామని మాట ఇచ్చారు,గద్దెనెక్కాక మాట మార్చారు..నాడు వ్యవసాయ కూలికి ఇస్తామని,నేడు జాబ్ కార్డు కలిగి ఉండి,20రోజులు పనిచేసిన వారికే ఇస్తామని కొర్రీలు పెడుతున్నారన్నారు.58 లక్షల పై చిలుకు మందికి జాబ్ కార్డు కలిగి ఉంది.భూమిలేని వ్యవసాయ కూలిలు అంటూ,20 రోజు పని దినాలు చేసిన వారికే వేస్తమనటం హమీ ఎగవేతకు నిదర్శనంగా చెప్పవచ్చు..సన్న చిన్నకారు రైతులు ఎకరా,రెండెకరాలున్న రైతులూ ఉపాది హామీ పనికి వెల్లే వాల్లే,వారిని పరిగణలోకి తీసుకోకుండా కుట్ర చేస్తున్న కాంగ్రేస్ తీరును బీఆర్ఎస్ ఖండిస్తుంది. మున్సిపాలిటీల పరిదిలో ఉండే వ్యవసాయ కూలీలకు జాబ్ కార్డ్ లేవు.వారు అర్హులా..? కాదా..? కాంగ్రేస్ ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం..వరంగల్ జిల్లాలో 11 మండలాల్లో ప్రతీ మండలానికి ఒక గ్రామ పంచాయతీని తీసుకుని కాంగ్రెస్ నిబందనల ప్రకారం ఎంత మందికి రైతు కూలి పథకం వస్తుందో సర్వే నిర్వహించడం జరిగిందన్నారు.

11 గ్రామాల్లో 5 వేల మందికి జాబ్ కార్డ్స్ ఉన్నాయి..భూమి లేని వారు 780 కుటుంబాలు,20 రోజుల పనిదినాలు పూర్తి చేసిన వారి సంఖ్య 331 గా ఉంది.దీని ప్రకారం భూమి లేకుండా,జాబ్ కార్డ్ కలిగి ఉండి,20 రోజుల పనిదినాలు పూర్తి చేసిన వారి శాతం 5.6% మాత్రమే.ఈ లెక్క ప్రకారం 3,27,700 మంది వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి చేసిన కుట్రలో బాగంగా కూలిలకు ఎగనామం పెడుతుంది..కేవలం 300 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మమ అనిపించే కుట్ర చేస్తుంది రేవంత్ సర్కారు..ఇది పచ్చి మోసం,దగా,కుట్రగా బీఆర్ఎస్ అభివర్నిస్తుంది,దీనిపై మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చర్చించి జిల్లాల్లో కార్మిక విభాగం పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యచరణ ప్రకటిస్తాం..స్థానిక సంస్థలలో గట్టేక్కేందుకే కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది..18 లక్షల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు.కులగణనకు ప్రజలు సహకరించలేదు..అనేక నిబందనలతో రేషన్ కార్డ్ ను తొలగించే ప్రయత్నం చేస్తుంది..

18 లక్షల దరఖాస్తులు ఉంటే కాంగ్రెస్ తెచ్చిన నిబందనలతో కేవలం 3-4 లక్షల మందికే రేషన్ కార్డు పరిమితం చేసేలా కుట్రలు చేస్తున్నారు. రైతులను,రైతు కూలీలను నయవంచన చేసింది రేవంత్ సర్కారు. పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలతో హామీలు ప్రకటించిన కాంగ్రేస్ ప్రభుత్వం.గద్దెనెక్కక మాట తప్పింది.జనవరి 26 లాంటి పవిత్రమైన రోజులు అపవిత్రం చేసే కుట్ర కాంగ్రేస్ తలపెట్టింది.గ్రామాల్లో రైతులు,రైతు కూలీలు ఈ కుట్రపై చర్చ పెట్టాలి,ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.తెలంగాణలో ఒక పథకాన్ని సంపూర్ణంగా పూర్తి చేయని రేవంత్ రెడ్డి మహారాష్ట్ర కు వెల్లి అబద్దాలు చెబితె ప్రజలు బుద్ది చెప్పారు.డిల్లీలో కూడా రేపు ప్రజలు బుద్ది చెబుతారు. తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికల కోసమే పథకాల డ్రామా..హామీల అమలులో కాంగ్రేస్ కు చిత్తశుద్ది లేదు..ఎగవేతలు,కోతలు,మోసాలే కాంగ్రేస్ ఎజెండా..100 % మందికి ఇస్తామని 3% మందికి కూడా ఇవ్వలేని కాంగ్రేస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలి..గ్రామాల్లో రైతులు,ప్రజలు కాంగ్రేస్ నేతలను నిలదీయాలి,తగిన బుద్ది చెప్పాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తుందన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *