జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ …

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన సంగతి తెల్సిందే.. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ చర్చలు సఫలీకృతమయ్యాయి.
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో అలకబూనిన జీవన్ రెడ్డి తనకు పార్టీనే ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని తప్పవు ..
పార్టీలోని సీనియర్లకు తగిన గౌరవం ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారన్నారు. మరోవైపు ఇకపై ఏ నిర్ణయమైనా జీవన్ రెడ్డితో చర్చించి తీసుకుంటామని మున్షీ తెలిపారు.
