కంటెంట్‌ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేసిన “క“

 కంటెంట్‌ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేసిన “క“

Nayan Sarika Movie actor

అండర్ డాగ్ గా దీపా‌వళి బాక్సాఫీస్ రేసులోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “క“. కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేస్తూ సర్ ప్రైజింగ్ కలెక్షన్స్ రాబడుతోంది “క“. ఫస్ట్ వీక్ హ్యూజ్ నెంబర్ క్రియేట్ చేస్తున్న “క“ సినిమా, మరో రెండు వారాలు ఇలాగే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కంటిన్యూ చేయబోతోంది.

ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. “క“ విజయం ద్వారా ఇలాంటి కంటెంట్ డ్రివెన్ మూవీస్ మరిన్ని చేసేందుకు ప్రొడ్యూసర్స్ ధైర్యంగా ముందుకు వచ్చే ఒక పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ అవుతోంది. సరికొత్త ఆలోచనలతో దర్శకులు సినిమాలు చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని “క“ ప్రూవ్ చేస్తోంది.

ఎవరి ఊహకు అందకుండా “క“ సినిమాను రూపొందించి దర్శకులు సుజీత్, సందీప్ సక్సెస్ అందుకున్నారు. “క“ లాంటి థ్రిల్లర్ మూవీకి సకుటుంబంగా ప్రేక్షకులు వచ్చి చూస్తున్నారంటే ఇందులోని స్ట్రాంగ్ స్టోరీ, మ్యాజికల్ స్క్రీన్ ప్లే, సినిమాకు తీసుకున్న బ్యాక్ డ్రాప్ కారణంగా చెప్పుకోవచ్చు. “క“ సినిమా కొత్త తరహా మూవీస్ చేసేందుకు ఫిలింమేకర్స్ కు స్ఫూర్తిగా నిలుస్తోంది.

May be an image of 5 people and text

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *