కల్కి కాన్వాయ్ అదరహో…!-వీడియో..!
పాన్ ఇండియా స్టార్ హీరో…యంగ్ రెబల్ హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కల్కి. ఈ నెల 27న విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ప్రమోషన్లు వేగవంతం చేసేందుకు ‘కల్కి’ టీమ్ సరికొత్త శ్రీకారం చుట్టింది.
ఇందుకు LED స్క్రీన్లు ఏర్పాటు చేసిన వాహనాలను ఎంచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను కల్కి టీమ్ పంచుకుంది.
దేశమంతా వెలుగును పంచే యాత్ర ప్రారంభమవుతుందని ట్వీట్ చేసింది. దీంతో కల్కి కాన్వాయ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.