రేవంత్ సర్కారుకి కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని పలు బీసీ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులతో.. నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకోసం ఇచ్చిన హామీలపై చర్చించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్…42% రిజర్వేషన్ ఇలా పలు అంశాల గురించి ఆమె సుధీర్ఘంగా నేతలతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాబై శాతం కంటే ఎక్కువగా బీసీలుంటే నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు.. ఏ ప్రతిపాదికన ఈ అంశాన్ని తీసుకోస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వం నియమించిన బీసీ డెడికెటేడ్ కమిటీ నివేదిక ఇచ్చినాక.. నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేశాక పంచాయితీ ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. లేకపోతే రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోస్తాము అని ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకోసం రాష్ట్ర స్థాయి.. జిల్లా స్థాయి.. మండల స్థాయి.. గ్రామ స్థాయిలో పలు ఉద్యమాలను సైతం చేస్తామని కూడా అన్నారు.