కమ్మ అంటే అమ్మలాంటిది
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కమ్మ అంటే అమ్మలాంటిది.పది మందిని ఆదుకునే స్వభావం ఉన్నవాళ్లు కమ్మవాళ్లు.. మట్టిలో నుండి బంగారం తీసే శక్తి కమ్మవారికి ఉంది. కమ్మ వర్గం నుండి వచ్చిన ఎన్టీఆర్ ఈ దేశ రాజకీయాలకు ఓ మార్గం చూపించారు.
రాజకీయాల్లో ఎన్టీఆర్ ఓ బ్రాండ్. పెద్దపెద్ద కంపెనీల నుండి చిన్న చిన్న కంపెనీల వరకు అన్నింటిలోనూ ఉన్నత స్థాయిల్లో ఉన్నది కమ్మవాళ్ళే. ఎలాంటి నేలల్లో అయిన పంటలు పండించే శక్తి ఉన్నవాళ్లు కమ్మవాళ్లు. చంద్రబాబు యొక్క గొప్పతనం గురించి నేను వేరుగా చెప్పనక్కర్లేదు.
మేం ఎవరిపైన వివక్షత చూపించము. కులం అనేది వృత్తి నుండి వచ్చింది. పారిశ్రామికవేత్తలు,వ్యాపారవేత్తలు,మీడియా,రాజకీయం రంగం ఏదైన కానీ కీ రోల్ కమ్మవాళ్ళే .. నన్ను కమ్మసామాజిక వర్గం ఎంతగానో ఆదరించింది. గతంలో ఢిల్లీలో వెంకయ్య నాయుడు,ఎన్టీఆర్ ఎంతో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పాత్ర పోషిస్తున్నారు అని అన్నారు.