కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోష్..!
కర్ణాటక ఉపఎన్నికలో కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. శిగ్గావ్లో బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైపై కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ పఠాన్ గెలుపొందారు.
మరోవైపు సందూర్లో కాంగ్రెస్ క్యాండిడేట్ అన్నపూర్ణ ఘన విజయం సాధించారు. దీనిపై ఈసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం మూడుచోట్ల ఉపఎన్నిక జరగ్గా చన్నపట్నలోనూ కాంగ్రెస్ అభ్యర్థి యోగీశ్వర ముందంజలో ఉన్నారు.