భట్టికి కార్తీక్ రెడ్డి కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ “పదేండ్లు అధికారాన్ని అనుభవించి… పదవులను తీసుకొని కేవలం సబితా ఇంద్రారెడ్డి అధికారం కోసం పార్టీ మారారంటూ” ఆరోపించిన సంగతి తెల్సిందే..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి కుమారుడు బీఆర్ఎస్ యువనేత కార్తీక్ Xలో స్పందించారు. “దివంగత సీఎం వైఎస్సారు మరణం తర్వాత మా అమ్మపై సీబీఐ కేసులు పెట్టించారు.
2014, 2018 ఎన్నికల్లో కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పి మాకు అన్యాయం చేశారు. రాజకీయ సమాధి చేయాలని కాంగ్రెస్ వాళ్లే ప్రయత్నిస్తుంటే పార్టీ మారాము. సత్యం తెలుసుకుని భట్టి మాట్లాడితే బాగుంటుంది’ అని అయన పేర్కొన్నారు.