రంగంలోకి గులాబీ బాస్ కేసీఆర్..?
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు తప్పా పెద్దగా ప్రభావితం చూపే పోరాటాల్లో పాల్గోనలేదు మాజీ ముఖ్యమంత్రి..గులాబీ బాస్ కేసీఆర్..పార్లమెంట్ ఎన్నికల సమయంలో…ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజు తర్వాత కేసీఆర్ ఫామ్ హౌజ్ లో .. నందినగర్ లో బీఆర్ఎస్ శ్రేణులను కలవడం..సమీక్షా సమావేశాలు నిర్వహించడం ఇదే ఇప్పటివరకు మనం గమనించింది.
కేసీఆర్ త్వరలోనే నియోజకవర్గాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు.. పోరాటాలు చేయనున్నట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల్లో గులాబీ పార్టీ గెలుపే లక్ష్యంగా గులాబీ దళపతి వ్యూహారచన చేస్తున్నారు.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటే గెలుపొందిన నల్గోండ జిల్లా నుండే గులాబీ దళపతి సమరశంఖం పూరించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగు దసరా తర్వాత అంటే నవంబర్ ,డిసెంబర్ నెల మధ్య జరగనున్న తరుణంలో అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు హారీష్ రావు, కేటీఆర్ దూకుడు పెంచడంతో కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు మరింత రంజుకు చేరనున్నాయి.. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు.. పురపాలక ఎన్నికలు ఉన్న సందర్భంలో గులాబీ బాస్ ఎంట్రీ గులాబీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే శుభపరిణామం అవుతుందని తెలంగాణ భవన్ వర్గాల టాక్.