కాంగ్రెస్ సర్కారుకు కేసీఆర్ వార్నింగ్…!

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ లోని ఎర్రవల్లి తన ఫామ్ హౌజ్ లో మెదక్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు.. బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాబోయేది మన ప్రభుత్వమే.
ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. నిన్న కాంగ్రెస్సోళ్ళే పెట్టిన పోల్ సర్వేలో కూడా ప్రజలు మనకే ఓట్లు వేశారు. నేను మౌనంగా ఉన్నాను . కానీ అన్నింటిని గంభీరంగా చూస్తున్నాను. నేను కొట్టే దెబ్బ మాములుగా ఉండదు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఉంటుంది. ఈ సమావేశాల్లో పదహారు బిల్లులను కేంద్ర సర్కారు ప్రవేశపెడుతుంది.
తులం బంగారానికి ఆశపడి ప్రజలు ఓట్లేశారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు తగిన గుణపాఠం చెప్పారు. కాంగ్రెస్సోళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారు.నేను నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్పిన నమ్మలేదు. మళ్లీ కరెంటు కష్టాలు వచ్చాయి.. నీళ్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పాలనపై అందరూ అసంతృప్తే. ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. వారి తరపున కొట్లాడుతుంటే మనవాళ్లపై పెడుతున్నారు. ఎవరూ ఆధైర్యపడోద్దు. మనకు కేసులు కొత్త కాదు.. జైళ్లు కొత్త కాదు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లీంలను నాశనం చేసింది..త్వరలో నేనే వస్తున్నా.. ఫిబ్రవరి నెలాఖరిలో ఓ బహిరంగ సమావేశంలో పాల్గోంటాను అని అన్నారు.
