ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి పేదలకు ఇవ్వనున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఆ ప్రకటనలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి మూడున్నర వేల ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాము. ముందుగా ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు అందజేస్తాము.. ఒంటరి మహిళలు.. పూరి గుడెసెలు ఉన్నవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తాము.
సంక్రాంతి పండక్కి లోపు ఇందిరమ్మ ఇండ్ల అర్హులను గుర్తిస్తాము అని ఆయన తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్ లేకపోయిన.. గత ప్రభుత్వం అప్పుల ఊబిలో కూర్చుబెట్టిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాము అని ఆయన అన్నారు.