హైడ్రా ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమిత చెరువులను.. ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన నూతన వ్యవస్థ హైడ్రా.
హైడ్రా ఏర్పాటు గురించి కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ఏర్పాటు చేసే సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి.
హైడ్రా ఏర్పాటును ఎవరూ తప్పు పట్టలేరు. హైడ్రా అనేది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ అని కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు హైడ్రాకు విశేషాధికారాలు కల్పిస్తూ పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.