ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Ap: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమావేశమైన ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా దాదాపు 14 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమ్మ ఒడి చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా రాష్ట్రంలో రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.
రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ.20 వేలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రధానమంత్రి నరేందర్ మోదీ పర్యటనపై కేబినెట్ సబ్‌కమిటీ వేసింది. ఈనెల 8న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోదీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.