మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక నిర్ణయం
కల్లు గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…తాటి చెట్టు నుంచి పడి గీతా కార్మికులు చనిపోతున్నారని ఈ కాటమయ్య కిట్, ప్రమాదం నుంచి ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామని ఆయన చెప్పారు.
స్వయంగా సీఎం రేవంత్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎలా పని చేస్తుందో ముఖ్యమంత్రి వివరించారు.ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుల నిధులు , పార్లమెంటు సభ్యుల నిధులు కూడా వెచ్చించి కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. వృత్తిలో ఉన్న వారికి రక్షించుకోవడంతో పాటు భవిష్యత్‌లో పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారు ఉన్నత శిఖరాలు పొందేలా కష్టపడాలని సూచించారు.
తాటి చెట్లు ఎత్తు తక్కువ ఉండేలా కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. స్థలం ఉంటే బోర్లు వేసి చెట్లను నాటి కాపాడుకోవాలని అన్నారు. బోర్ వేసే ప్రతిపాదన ఇవ్వండి వెంటనే వేయిస్తామని తెలిపారు.ఎక్స్‌గ్రేషియా పాత బకాయిలు విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.