తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమావేశమైన మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ,బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్-1 క్యాడర్ లో డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది క్యాబినెట్.
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో కప్ గెలిచిన టీమిండియాలో మెయిన్ పాత్ర పోషించాడు మహ్మద్ సిరాజ్. గతంలో రెండు సార్లు చాంపియన్ గా నిలిచారు నిఖత్ జరీన.
ఇంకా క్యాబినేట్ మీటింగ్ కొనసాగుతుంది.ఈ క్యాబినెట్ లో జీహెచ్ఎంసీ లో మిగతా మున్సిపాలిటీలు విలీనం.. కొత్త రేషన్ కార్డుల జారీపై సబ్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై కూడా చర్చ జరగనున్నది.