ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లతో పాటు పలువురి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే.
ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు. ఎప్పుడు అనర్హత వేటు వేస్తారు.. ఎప్పుడు వాళ్లకు నోటీసులు ఇస్తారు. ఎప్పటిలోగా విచారిస్తారు.. ఎప్పటి వరకు వాదనలు వింటారు.. ఇలా పలు అంశాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని అసెంబ్లీ సెక్రటరీను హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలపై బీఆర్ఎస్ శ్రేణులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.. ఎమ్మెల్యేల పిరాయింపులపై హైకోర్టు ఆదేశాలు స్వాగతిస్తున్నాము.. ఎప్పటికైన న్యాయమే గెలుస్తుంది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో చేరిన సమయంలో తమ పదవులకు రాజీనామా చేయాలి. చేయకపోతే హైకోర్టు తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పటికైన సరే స్పీకర్ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.