ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైన ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్..వదిలే ప్రసక్తేలేదు
ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అది చేస్తామని అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడుతూ రాష్ట్రంలోని గత ప్రభుత్వం వైపల్యంతోనే ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ కారణంగానే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తమ కూటమి ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటుంది.
రాష్ట్రంలో కరడుగట్టిన నేరస్తులకు స్థానం లేదు. ఎవరైన నేరాలు చేస్తే తాట తీస్తాము.. ఎవరైనా బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తాము.. రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు లేకుండా ఎమ్మెల్యేలే చూడాలి అని ఆయన హితవు పలికారు.