ప్రియాంక ,సోనియా,రాహుల్ గాంధీల సాక్షిగా ఖర్గేకు ఘోర అవమానం
వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నేత ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్న సంగతి తెల్సిందే. ప్రియాంక గాంధీ నామినేషన్ వేశారు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత నేత మల్లిఖార్జున ఖర్గే , సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు, ఆపార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో నామినేషన్ వేయడానికి ప్రియాంక గాంధీ ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. ఆ క్రమంలో ఆఫీసు బయట ఎదురుచూసేలా ఖర్గేను నిలబెట్టారు. నకిలీ గాంధీ కుటుంబంతో జతకట్టిన ఖర్గే పార్టీకి జాతీయ అధ్యక్షుడైనప్పటికి లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ..
ప్రియాంకగాంధీ నామినేషన్ వేస్తుండగా గది బయట ఖర్గే బయట ఉండటం ఏంటని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ప్రశ్నించారు.దళితుడైనందుకే ఖర్గే ను దూరం పెట్టారని ఆయన అన్నారు.దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు.