కేసీఆర్.. కేటీఆర్.. జగదీష్ రెడ్డిలు జైలుకెళ్లడం ఖాయం..!
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్.. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ సీనియర్ శాసన సభ్యులు.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం అని అంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కోమటీరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మీడియాతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేండ్ల పాటు ఎన్నో అక్రమాలు.. అవినీతి చేశారు. బడా బడా కాంట్రాక్టర్ల దగ్గర నుండి మాజీ మంత్రి కేటీఆర్ కు ముప్పై శాత వాటాలు వచ్చేవి. నల్గోండ జిల్లాలో మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని అధికార మదంతో జగదీష్ రెడ్డి చేయని దందా లేదు. అన్ని బయటకు వస్తాయి.
కాళేశ్వరంలో అవినీతి జరిగింది. మిషన్ భగీరథలో అవినీతి జరిగింది. ప్రతి పథకంలో బీఆర్ఎస్ నేతలు నీకింతా నాకింతా అని పంచుకు తిన్నారు. కేటీఆర్ అధికారం పోయిన కానీ గర్వం తగ్గలేదు.. పొగరు ఉండకూడదు. నోటీకి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఈ ముగ్గురి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఊదారంగా ఉన్నారు. వీరు ముగ్గురు జైలుకెళ్లడం ఖాయం అని అన్నారు.