సానుభూతికోసమే కేటీఆర్ అరెస్ట్ డ్రామాలు..?
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ బాబు ” లగచర్లలో అధికారులపై హత్యాప్రయత్నం జరిగింది.
ప్రభుత్వాన్ని ఆస్థిరపరచడానికి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. కేటీఆర్ అరెస్ట్ కు మేమేమి కుట్రలు చేయడం లేదు. సానుభూతి కోసమే .. ప్రజల్లో ఆదరణను పొందడానికే కేటీఆర్ అరెస్ట్ డ్రామాలు ఆడుతున్నారు.
లగచర్ల ఘటనపై విచారణ జరుగుతుంది.రైతుల ముసుగులో కొంతమంది కావాలనే దాడికి పాల్పడ్డారు. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటికైన బీఆర్ఎస్ నేతలు నిజాలు తెలుసుకోవాలి అని ఆయన అన్నారు.