బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ..!
హైకోర్టులో దాఖలు చేసిన నాట్ టూ అరెస్ట్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజధాని నగరం హైదరాబాద్ లోని నందినగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు..
హైకోర్టు తీర్పుపై లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలా…? లేదా..? అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు..
ఇప్పుడు ఏసీబీ తీసుకునే నిర్ణయంపై బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొన్నది.ఇప్పటికే ఈ నెల తొమ్మిదో తారీఖున ఏసీబీ విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు సైతం జారీ చేసింది.