రేవంత్ రెడ్డి కి కేటీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గత పడేండ్లుగా చేతినిండా పనులతో కళ కళ లాడిన చేనేత రంగం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సంక్షోభం లో కూరుకుపోయిందని కేటీఆర్ విమర్శించారు.
గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆపేయాలన్న కాంగ్రెస్ సర్కారు నిర్ణయంతో నేతన్నల జీవితాలు అయోమయంలో పడ్డాయి. ఉపాధి లేక ఆకలి బాధ తట్టుకోలేక చేనేత కార్మికుకులు తనువు చాలిస్తున్నారు.
నేతన్నలవి ఆత్మహత్యలు కావు ప్రభుత్వపు హత్యలు. పనులు కరువై ఇప్పటిదాకా పదిమంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. తక్షణమే వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఎక్స్ గ్రేసీయా అందించాలని రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు.