తర్వాత మాజీ మంత్రులే అరెస్ట్…?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన నేత.. మాజీ మంత్రి.. విశాఖ జిల్లా వైసీపీ అధినేత గుడివాడ అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీకి చెందిన సోషల్ మీడియా వారీయర్స్ ను అరెస్ట్ చేస్తున్నారు.
వీళ్ల తర్వాత మాలాంటి మాజీ మంత్రులనే అరెస్ట్ చేస్తారు. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ప్రశ్నించకూడదు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడకూడదు.
హామీల అమలు గురించి మాట్లాడిన.. ప్రశ్నించిన కానీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇదేమి ప్రజాస్వామ్య వ్యవస్థ. కూటమి ప్రభుత్వం హామీల అమలు కంటే అమలు చేయమన్నవాళ్లను అరెస్ట్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంది అని ఆయన ఆరోపించారు.