పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లీగల్ నోటీసులు పంపారు.. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్టీపీసీ లో ప్లైయాష్ కుంభకోణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాత్ర ఉంది..
కుంభకోణాలకు పెట్టిన పేరు మంత్రి పొన్నం..పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు.. ఈవార్తలను వీడియోలను కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి..
దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,కొన్ని మీడియా సంస్థలు తన వ్యక్తిగత ఇమేజ్ ను డామేజ్ చేస్తూ అసత్య ప్రచారం నిర్వహించాయి.. అందుకే తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు..