ఎల్ కే అద్వానీకి తీవ్ర అస్వస్థత..!
మాజీ ఉప ప్రధానమంత్రి.. బీజేపీకి చెందిన సీనియర్ నేత ఎల్ కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అద్వానీని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో వైద్యులు తగిన చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు గతంలో పలుమార్లు అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సంగతి మనకు తెల్సిందే. ఇప్పటికే అనేక సార్లు ఆయన ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం అద్వానీకి తొంబై ఏడేండ్లు.