TDPలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి-క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడి టీడీపీలో చేరనున్నారు.
ఆ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నారు అని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై మాజీమంత్రి మల్లారెడ్డి స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి టీడీపీలో చేరతాను.టీటీడీపీ అధ్యక్ష పదవి నాకు ఇస్తున్నట్లు వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
టీడీపీలో చేరమని నన్ను ఎవరూ సంప్రదించలేదని ఆయన అన్నారు.ఇలా ఫేక్ వార్తలను ప్రసారం చేసేవాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు.