మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు..!

శనివారం కేంద్ర ప్రభుత్వం మొత్తం 136 పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందులో 2025 ఏడాదికి గానూ మొత్తం 139మందిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది.
ఏడుగురికి పద్మ విభూషణ్, పంతొమ్మిది మందికి పద్మభూషణ్,113మందికి పద్మ శ్రీ అవార్డులను ఇచ్చింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు .. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కోట్లాడుతున్న మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ పురస్కారం లభించింది.
ప్రజా వ్యవహారాలకు సంబంధించి మందకృష్ణ చేసిన కృషికి గానూ ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది.
