నేడు మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలు..!
దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు ఉదయం గం. 11.45నిమిషాలకు జరగనున్నాయి. దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పరిధిలోని నిగమ్ బోధ్ ఘాట్ లో జరగనున్నాయి.
సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను సైతం చేస్తుంది.
ముందుగా మన్మోహాన్ సింగ్ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుండి కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ నుండి నిగమ్ బోధ్ ఘాట్ కు తరలిస్తారు.