“ఆ హీరో ” అంటే మీనాక్షి చౌదరికి తెగ ఇష్టం..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా ఈ సంక్రాంతి పండక్కి వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా… హీరోకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది అందాల రాక్షసి మీనాక్షి చౌదరి.
ఈ చిత్రం హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కోట్లను కొల్లగొడుతుంది. ఈ చిత్రం విజయోత్సవంలో ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి పలు ఇంటర్వూలు ఇస్తుంది. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ” తనకిష్టమైన హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆమె మాట్లాడుతూ “ఇలాంటి అబ్బాయి నా జీవితంలోకి వస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటరు. హైట్ మంచి ఇంటిల్ జెంట్ తో పాటు మంచి మనస్సుండాలని అందరూ భావిస్తారు. నాకు మేల్ వెర్షన్ కావాలి. అలాంటి వ్యక్తి ప్రభాస్ కావాలి. ప్రస్తుతం నాకు ప్రభాస్ గారంటే చాలా ఇష్టం. ఆయన పొడుగ్గా అందంగా ఉంటారు అని తెలిపారు.
