2014లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం – కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

 2014లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం – కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఏర్పడిన మొదట్లో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ను విలీనం చేయాలని కేసీఆర్ అనుకున్నారు.. ఆ తర్వాత మోసం చేశారని కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కేంద్ర సర్కారు వివక్షపై జరిగిన చర్చలో సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ మాట్లాడుతూ ” తప్పు చేసి ఉంటేనే తమను రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏపడిన సమయంలో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయాలనుకున్నాము.. కానీ దిగ్విజయ్ సింగ్ వైఖరితో కాలేదని తేల్చి చెప్పారు.

మరోవైపు పరిపాలన చేయడం చేతకాక కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. విద్యుత్ కు సంబంధించి డిస్కంలు ప్రైవేటీకరణ చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *