ఉండి లో మంత్రి లోకేష్ పర్యటన..!
ఏపీ లో ఉండి నియోజకవర్గంలో 108 ఏళ్ల చరిత్ర కలిగి ఇటీవల ఆధునీకరించిన ఉండి జెడ్పి హై స్కూల్ భవనంతోపాటు బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులను మానవవనరులు, ఐటి శాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. హైస్కూలునుంచి గ్రామంలోకి రూ.18లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు.
అనంతరం ఉండి హైస్కూలు నుంచి పెదఅమిరంలో దివంగత రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత రతన్ టాటా మార్గ్ గా నామకరణం చేసిన భీమవరం – ఉండి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. సాగి ప్రసాదరాజు సౌజన్యంతో 35లక్షలతో వాటర్ ప్లాంట్ ను మంత్రి లోకేష్ వేదికపై నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన అమిరంలోని ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న కృషిని మంత్రి లోకేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సి.నాగరాణి, ఎమ్మెల్యేలు పులివర్తి రామాంజనేయులు (భీమవరం), కామినేని శ్రీనివాస్ (కైకలూరు), మద్దిపాటి వెంకట్రాజు (గోపాలపురం) పాల్గొన్నారు.