కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల లేఖ
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో ” తెలంగాణ లో నిజమాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు గత పదేండ్లుగా పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేస్తున్నారు.
ఉద్యమాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మీ బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపుబోర్డు గురించి బాండ్ పేపర్ పై సంతకం చేశాడు.
నిజామాబాద్ జిల్లా రైతుల సమస్యలను.. తెలంగాణ ప్రాంత పసుపు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో కోకానట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి.. వ్యవసాయ శాఖ మంత్రికి తుమ్మల లేఖ రాశారు.