ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన..!

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం అర్భన్ మండలంలోని బల్లేపల్లి- బాలపేట గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణ పనులను మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకునే అవకాశం మళ్లీ ఒకసారి వచ్చింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకేసారి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాము.
ప్రతి ఊరికి.. ప్రతి పల్లెకి సీసీ రోడ్లు.. బీటీ రోడ్లు మంజూరు చేశాము. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులిస్తాము.. ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాము.. అందరూ ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలి.. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరిగే ప్రక్రియ. పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేశాక సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఆయన అన్నారు.
