రుణమాపీ పై ఎమ్మెల్యే ఇలా..?- సీఎం అలా..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు శనివారం రైతుభరోసా, రైతు రుణమాఫీ అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కేవలం ఇరవై ఏడు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
ప్రజాపాలన ప్రభుత్వం. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. లక్ష రూపాయల అప్పు ఉంటే ఎనబై వేల రూపాయలు వడ్డీలకే వెళ్ళింది. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కేవలం ఇరవై ఏడు వేల కోట్లు మాత్రమే. మేము మొదటి ఐదేండ్లలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాము.
రాష్ట్ర వ్యాప్తంగా వందకు వందశాతం పూర్తి చేశాము అని అన్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణ రావు మాట్లాడుతూ మా నియోజకవర్గంలో 100 శాతం రుణమాఫీ జరగలేదు.. నియోజకవర్గంలో డెబ్బై శాతం వరకు రుణమాఫీ అయింది. కానీ 70 శాతం కూడా రుణమాఫీ జరగలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తాను అని సవాల్ విసిరారు.