మోదీ పిలుపు
పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని 18వ లోక్ సభ తొలిరోజు సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ వ్యాఖ్యానించారు.
సభలోని సభ్యులందరినీ కలుపుకొని ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా సాగుతాము..దేశంలోని ప్రజలందరీ ఆకాంక్షను నెరవేర్చేందుకు విపక్షాలూ సహకరించాలని ఆయన కోరారు.
దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ.. అటువంటి పొరపాటు పునరావృతం కాకూడదని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని మోదీ పేర్కోన్నారు.