కంట్రోల్ తప్పిన ఎంపీ ఈటల..!

MP Etala lost control..!
తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విక్షచణను కోల్పోయారు. మేడ్చల్ జిల్లాలో ఆయన పోచారం అనే గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పేద ప్రజలకు చెందిన భూములను కొంతమంది రియల్ ఎస్టేటర్లు.. బ్రోకర్లు ఆక్రమించుకున్నారు.
మాపేరు మీద ఉన్న భూములను లాక్కున్నారు. కబ్జా చేశారు అని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భూములను పరిశీలించాడానికెళ్ళిన ఎంపీ ఈటల అక్కడే ఉన్న బ్రోకర్లను చూసి ఒక్కసారికి ఆవేశం కట్టలు తెంచుకుంది.
తిని తినక రూపాయి రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకున్న స్థలాలను .. భూములను ఎలా లాక్కుంటారు. మీరు ఎవర్రా అసలు .. మీకేమి హక్కు ఉంది అక్కడున్న ఓ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు. దీంతో అక్కడున్న ప్రజలు సైతం దాడికి దిగారు.
