తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో ఎంపీ గాయత్రి రవి
తెలంగాణ బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు,గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్, అసెంబ్లీ మాజీ స్పీకర్స్ పోచారం శ్రీనివాసరెడ్డి, సిరికొండ మధుసూదనాచారి,బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి తెలంగాణ భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వారితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ,ఫోటో ప్రదర్శనను తిలకించారు,ఆచార్య జయశంకర్,తెలంగాణ తల్లికి విగ్రహాలకు,అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు..
అటుతర్వాత ఎంపీ వద్దిరాజు తెలంగాణ భవన్ ఆవరణలో జరిగిన సభలో కేసీఆర్
కేటీఆర్, హరీష్ రావు తదితరులతో కలిసి వేదికపై ఆశీనులయ్యారు..