సీఎం రేవంత్ రెడ్డికి ఎంఆర్పీఎస్ నేతలు కృతఙ్ఞతలు
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును స్వాగతించి, తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఙతలు తెలియజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో స్వీట్లు తినిపించుకుని సంబురాలు జరుపుకొన్నారు.
సీఎంను కలిసినవారిలో సీనియర్ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ , ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మందుల సామేల్ , కడియం శ్రీహరి, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సైతం డప్పు దరువులతో వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి వర్గీకరణ సంబురాలు పంచుకొని, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.